గ్లాస్గో వేదికగా జరుగుతున్న (COP26 in glasgow) వాతావరణ సదస్సులో భారత్, యూకేలు తమ ఐఎస్ఏ(అంతర్జాతీయ సౌర కూటమి) భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోనున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచదేశాలను ఏకం చేసేలా గ్రీన్ గ్రిడ్స్ ఇనీషియేటివ్‌ను ప్రారంభించనున్నాయి. ఒకే సూర్యుడు-ఒకే ప్రపంచం-ఒకే గ్రిడ్ (జీజీఐ-ఓఎస్ఓడబ్ల్యూజీ) అనే మల్టీలేటరల్ డ్రైవ్‌తో ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను (COP26 summit) ప్రోత్సహించనున్నారు.
"సోలార్ ఎనర్జీని తక్కువ ధరలో బదిలీ చేయడం ద్వారా ఇరుదేశాలు లబ్ధి పొందడం అనేది గ్లోబల్ గ్రీన్ గ్రిడ్స్ ఆవిష్కరణ ప్రధాన లక్ష్యం. భారత్, యూకేకు మాత్రమే కాకుండా సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవాలనుకునే దేశాలకు ఇదొక పెద్ద అవకాశం. జీజీఐ-ఓఎస్ఓడబ్ల్యూజీ అనేది సోలార్ ఎనర్జీని పొందడానికి ఉపయోగపడే విధానమే కాదు. మరో ఇంజనీరింగ్ అద్భుతంగా పరిణమిస్తుంది. సోలార్ ఎనర్జీ బదిలీ కార్యక్రమంలో పెట్టుబడి పెట్టే దేశాలను ఐఎస్ఏ ఆహ్వానిస్తోంది. గ్రిడ్స్ ఏర్పాటు, ఛార్జింగ్ పాయింట్స్, విద్యుత్ ఇంటర్ కనెక్టర్స్ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు, ఆర్థిక, విద్యుత్ సంస్థలను ఈ జీజీఐ-ఓఎస్ఓడబ్ల్యూజీ ఒక్కటి చేస్తుంది."