తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​ టెక్​ వీసా దరఖాస్తుల్లో భారత్​ టాప్​ - బ్రిటన్​

బ్రిటన్​ సాంకేతిక రంగ వీసా దరఖాస్తుల్లో భారత్​, అమెరికా అగ్రస్థానంలో నిలిచాయి. యూకేకు చెందిన టెక్​ నేషన్​ సంస్థ నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది. గత ఏడాదితో పోల్చితే భారత్​ నుంచి 45 శాతం దరఖాస్తులు పెరిగాయి.

బ్రిటన్​ టెక్​ వీసా దరఖాస్తుల్లో భారత్​ టాప్​

By

Published : Jun 15, 2019, 7:11 PM IST

బ్రిటన్​ టెక్​ వీసాల దరఖాస్తుల్లో భారత్​, అమెరికా ముందంజలో నిలిచాయి. భారత్​కు చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లతో పాటు సాఫ్ట్​వేర్​ డెవలప్​మెంట్​, కృత్రిమ మేధ, మెషీన్​ లెర్నింగ్​, ఫిన్​టెక్​, ఎంటర్​ప్రైజ్​, క్లౌట్​ విభాగాల బిజినెస్​ డెవలపర్లు అధిక సంఖ్యలో బ్రిటన్​ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు టెక్ నేషన్​ సంస్థ ఓ నివేదిక ద్వారా వెల్లడించింది.

టెక్​ నేషన్​... బ్రిటన్​లో ప్రముఖ టెక్​ దిగ్గజాల సమాఖ్య. సాంకేతిక నిపుణుల దరఖాస్తుల్ని పరిశీలించి, వారికి వీసా ఇవ్వాలో లేదో సిఫార్సు చేసే అధికారాన్ని బ్రిటన్​ హోంశాఖ టెక్​ నేషన్​కు కల్పించింది. అలాంటి సంస్థలు ఆ దేశంలో 5 ఉన్నాయి.

45శాతం వృద్ధి...

డిజిటల్​ టెక్నాలజీ రంగంలో టైర్​-1 వీసాల కోసం దరఖాస్తు చేసిన భారతీయుల సంఖ్య 2018-19లో 45శాతం పెరిగినట్లు టెక్​ నేషన్​ వెల్లడించింది.
భారత్​, అమెరికా తర్వాత టెక్​ వీసా దరఖాస్తుల్లో నైజీరియా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణాఫ్రికా ముందంజలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది టెక్​ నేషన్​.

ఇదీ చూడండి:ఫోర్బ్స్​ జాబితాలో రిలయన్స్​​, హెచ్​డీఎఫ్​సీ..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details