తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​కు 2 కోట్ల టీకాలు- 30 మిలియన్​ డాలర్ల సాయం'

భారత్​లో రెండో దశ కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 190 నుంచి 250 మిలియన్ల కొవిడ్​ వ్యాక్సిన్​లను పూర్తి సబ్సిడీతో అందిస్తామని అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి (గవి) స్పష్టం చేసింది. అంతేకాక సాంకేతిక సహాయం కోసం 30 మిలియన్ అమెరికన్ డాలర్లను అత్యవసర విరాళం కింద అందిస్తామని తెలిపింది.

అంతర్జాతీయ వ్యాక్సిిన్ కూటమి
GAVI

By

Published : May 7, 2021, 9:20 PM IST

కరోనా సెకండ్​ వేవ్​పై ధైర్యంగా పోరాడుతున్న భారత్​కు ప్రపంచ దేశాల నుంచి సాయం అందుతూనే ఉంది. తాజాగా భారత్​కు ఆపన్నహస్తం అందించేందుకు అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి( గవి ) ముందుకొచ్చింది. 190 నుంచి 250 మిలియన్ల కొవిడ్​ వ్యాక్సిన్​లను పూర్తి సబ్సిడీతో త్వరలో అందిస్తామని పేర్కొంది. అంతేగాక సాంకేతిక సహాయం కింద 30 మిలియన్​ డాలర్లను అందిస్తామని స్పష్టం చేసింది. డిసెంబర్​లో కొవాక్స్​ బోర్డు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.

" క్లిష్ట పరిస్థితుల్లో భారత్​కు సాయపడేందుకు అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి (గవి) కట్టుబడి ఉంది. ఏఎంసీ(అడ్వాన్స్ మార్కెట్​ కమిట్​మెంట్)​లో ఉన్న మొత్తం వ్యాక్సిన్​ డోసులలో 20 శాతాన్ని భారత్​కు​ ఇవ్వాలని డిసెంబర్​లో నిర్ణయించాం. దీని ప్రకారం భారత్​కు 190 నుంచి 250 మిలియన్ల డోసులు అందనున్నాయి."

-- అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి (గవి)

అంతేగాక ఏఎంసీలో ఉన్న మొత్తం విరాళాల్లో భారత్​కు 20 శాతం అందనుందని గవి అధికార ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయంగా అన్ని దేశాలకూ వ్యాక్సిన్​ అందేవిధంగా సహకారం అందిస్తామన్న అమెరికా ప్రభుత్వం ప్రకటనను స్వాగతించారు.

ఇదీ చదవండి :రూ. 100 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

ABOUT THE AUTHOR

...view details