తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధికి భారత్​ భారీ సాయం - gavi latest news

కరోనా వ్యాక్సిన్​ తయారీలో భాగంగా అంతర్జాతీయ వ్యాక్సిన్​ కూటమి-గవికి 15 మిలియన్ల డాలర్లు ఇవ్వనున్నట్లు భారత్ స్పష్టం చేసింది.​ బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ నిర్వహించిన వర్చువల్​ గ్లోబల్​ వ్యాక్సిన్​ సమావేశంలో.. ఈ మేరకు ప్రధాని మోదీ ప్రకటించారు.

India pledges USD 15 million for global vaccine alliance Gavi
గవికి 15 మిలియన్ల డాలర్లు ప్రకటించిన భారత్​

By

Published : Jun 4, 2020, 10:22 PM IST

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో భారత్​ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ వ్యాక్సిన్​ కూటమి-గవికి 15 మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు గురువారం హామీ ఇచ్చింది. ఈ మేరకు వర్చువల్​ గ్లోబల్​ వ్యాక్సిన్​ సమావేశంలో ప్రధాన మంత్రి వెల్లడించారు.

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ నిర్వహించిన ఈ సమావేశంలో.. ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో భారత్​ ప్రపంచానికి తోడుగా నిలుస్తుందని మోదీ తన ప్రసంగంలో వివరించారు. ఇతరులకు సాయం చేయడం ద్వారా మనకు మనం సాయం చేసుకున్నట్లేనని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో 50 దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్తలు, ఐరాస ప్రతినిధులు, పలు దేశాధినేతలు పాల్గొన్నారు.

ప్రపంచమంతా ఒకే కుటుంబం...

భారత్​లో కోట్ల జనాభాతో పాటు పరిమితమైన ఆరోగ్య సదుపాయాలు ఉన్నాయని మోదీ అన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్​ అవసరం ఎంతో ఉందని ఉద్ఘాటించారు. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూడటం భారతదేశ నాగరికత నేర్పే పాఠాలని, మహమ్మారి సమయంలో ఆ విధంగానే కలిసికట్టుగా ఉండేందుకు భారత్​ ప్రయత్నించిందని మోదీ వెల్లడించారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు బోరిస్​ జాన్సన్​కు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.

ABOUT THE AUTHOR

...view details