'కశ్మీర్' అంశంపై తొలిసారి పెదవి విప్పారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్. ఇది భారత్- పాక్ ద్వైపాక్షిక అంశమేనని ప్రకటించారు. ఇందులో మూడో వ్యక్తి జోక్యం ఉండకూదని.. కశ్మీర్లో హింసను ప్రేరేపించే విధంగా ఇతర దేశాలు వ్యవహరించకూడదని మెక్రాన్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీతో పరస్పర చర్చల అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు.
జమ్ముకశ్మీర్‌పై భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని మోదీ తనకు వివరించారన్నారు మెక్రాన్. కశ్మీర్ ప్రాంత ప్రజల హక్కులకు భంగం కలుగకుండా చూడాలని భారత ప్రధానిని కోరినట్లు తెలిపారు. 36 రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భాగంగా తొలి విమానాన్ని వచ్చే నెలలో భారత్‌కు అందించనున్నట్లు స్పష్టం చేశారు.
"జమ్ముకశ్మీర్ అంశంపై భారత్-పాక్ ద్వైపాక్షికంగానే చర్చించుకుని పరిష్కారాన్ని కనుగొనాలి. ఇందులో ఇతర దేశాల జోక్యం ఉండకూడదు. ఇదే విషయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడబోతున్నా."
- ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
స్వార్థపూరిత స్నేహం కాదు..