ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి విడిపోయి స్వతంత్రంగా దేశంగా మారిన బ్రిటన్.. భారత్‌ను కీలక వాణిజ్య భాగస్వామిగా చేసుకోవాలని యోచిస్తుంది. అయితే భారత్‌ను వాణిజ్య భాగస్వామిగానే కాకుండా.. ప్రత్యర్థిగాను చూడాలని పేర్కొంది అంతర్జాతీయ వ్యవహారాలను అంచనా వేసే చాతమ్హౌస్(రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నెషనల్ అఫైర్స్) సంస్థ. ఈ మేరకు 'గ్లోబల్ బ్రిటన్, గ్లోబల్ బ్రోకర్: బ్రిటన్ భవిష్యత్- అంతర్జాతీయ పాత్ర' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోని ఉదార ప్రజాస్వామ్య దేశాలను అనుసంధానించి గ్లోబల్ బ్రోకర్‌గా అవతరించడానికి, అలాగే ఈయూ సభ్య దేశాలతో సహా అమెరికాతో సంబంధాలు కొనసాగించడంపై బ్రిటన్ దృష్టి సారించిందని చాతమ్హౌస్ పేర్కొంది.
బ్రిటన్ లక్ష్యాల విషయంలో విభేదాలు
"చైనా నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి కారణంగా ఆసియా- పసిఫక్ ప్రాంతంలోని ప్రజాస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలు.. అమెరికా-బ్రిటిష్ కూటమిలో భాగంగా ఉన్నాయి. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసం చైనా, భారత్, సౌదీ అరేబియా టర్కీ వంటి దేశాలతో లోతైనా సంబంధాల కోసం బ్రిటన్ ప్రయత్నిస్తోంది. దీనివల్ల 'గ్లోబల్ బ్రిటన్' లక్ష్యాల విషయంలో విభేదాలు వచ్చే అవకాశముంది" అని చాతమ్హౌస్ హెచ్చరించింది.
అలా ఉండటం కష్టమే
"బ్రిటన్.. భారత్‌తో కీలక సంబంధాలు కుదుర్చుకోకుండా ఉండటం కష్టమే. ఎందుకంటే.. సమీప భవిష్యత్‌లో జనాభా పరంగా అతిపెద్ద దేశంగా భారత్ అవతరించనుంది. ఆర్థికంగానూ ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది. రక్షణ వ్యవస్థలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టనుంది" అని చాతమ్ పేర్కొంది. అయితే చరిత్రను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో సంబంధాల విషయంలో బ్రిటన్ జాగ్రత్త వహించాలని సూచించింది.
భారత్ తీరు