Russia-Ukraine War Crisis: ఉక్రెయిన్‌పై బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది రష్యా. ఆ దేశ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు వేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రష్యా ఆర్థిక వ్యవస్థతో పాటు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సహా కీలక నేతలపై చర్యలకు ఉపక్రమించారు ప్రపంచ నేతలు. పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆస్తులు ఫ్రీజ్ చేయాలని ఈయూ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. తీవ్రమైన ఆంక్షలకు జపాన్, ఐరోపా, ఆస్ట్రేలియా, తైవాన్ సహా పలు దేశాలు సిద్ధమయ్యాయి. రష్యా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్ సహా దాని యూరోపియన్ మిత్రదేశాలు.. మాస్కోపై తీవ్రమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక, ఇంధన, ఇతర రంగాలే లక్ష్యంగా ఆ ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మేక్రాన్ పేర్కొన్నారు.
రష్యా బ్యాంకులు, ఇతర కీలక సంస్థలపై ఆంక్షలు విధించటంలో ఐరోపా సమాఖ్య, అమెరికాకు ఆసియా పిసిఫిక్లోని పలు దేశాలు తోడయ్యాయి. రష్యా పరిశ్రమలు, మిలిటరీని అదుపు చేసే లక్ష్యంతో సెమీకండక్టర్లు, ఇతర హైటెక్ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రిస్తున్నాయి. రష్యా బృందాలు, బ్యాంకులు, వ్యక్తుల వీసాలను నిలిపివేయటం సహా ఇతర కఠిన ఆంక్షలు ప్రకటించిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా. బలగాలతో ఏ దేశం సరిహద్దులను మార్చాలని చూసినా ఊరుకోబోమని స్పష్టం చేశారు. రష్యా చర్య కేవలం ఐరోపానే కాక ఆసియాపైనా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్‌కు భారీ సాయం..
రష్యాపై విధించాల్సిన ఆంక్షలకు తుదిరూపు ఇచ్చిన ఐరోపా సమాఖ్య.. వాటి ఆమోదం కోసం శుక్రవారం.. సభ్య దేశాల విదేశాంగ మంత్రుల ముందుకు పంపించింది. అలాగే.. 1.5 బిలియన్ యూరోలు(1.68బిలియన్ డాలర్లు) సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించేందుకు ఐరోపా సమాఖ్య నిర్ణయించినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తెలిపారు.
ఉక్రెయిన్‌లో ఐక్యరాజ్య సమితి మానవతా సహాయ కార్యక్రమాల కోసం మరో 20మిలియన్ల డాలర్లు అందించాలని ఐరాస నిర్ణయించింది. యూఎన్ సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ ద్వారా తూర్పు డొనెట్స్క్, లుహాన్స్ సహా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అత్యవసర కార్యకలాపాలు, యుద్ధం ద్వారా తీవ్రంగా ప్రభావితమైన ప్రజల ఆరోగ్యం, ఆశ్రయం, ఆహారం, నీరు, పరిశుభ్రతకు ఉపయోగపడతాయని యూఎన్ హ్యూమనేటిరియన్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్.
విమానాలపై నిషేధం..
రష్యా విమానయాన సంస్థ ఎయిరోఫ్లోట్ విమానాలపై బ్రిటన్ నిషేధం విధించిన క్రమంలో ప్రతీకార చర్యలు చేపట్టంది రష్యా. యూకే విమానాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. తమ గగనతలం వినియోగించుకోకుండా చర్యలు తీసుకుంది.
రష్యా సరఫరా గొలుసుపై ప్రభావం..