2022-24 కాలానికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలికి (UN Human Rights Council) గురువారం మరోసారి ఎన్నికైంది భారత్. ఈ సందర్భంగా మానవ హక్కుల ప్రచారం, పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని (UNHRC India Member) ప్రమాణం చేసింది.
ఐరాస మానవహక్కుల మండలికి మరోసారి భారత్
ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలికి (UN Human Rights Council) మరోసారి ఎన్నికైంది భారత్. 2022-24 కాలానికి గానూ భారీ మెజారిటీతో మండలిలో భారత్ చోటు దక్కించుకుంది.
మానవ హక్కుల మండలి
"భారీ మెజారిటీతో ఐరాస మానవ హక్కుల మండలికి 6వ సారి భారత్ ఎన్నికైంది. భారత్‌పై విశ్వాసముంచిన యూఎన్ (UN Human Rights Council News) సభ్య దేశాలకు కృతజ్ఞతలు. 'సమ్మాన్, సంవాద్, సహ్యోగ్' నినాదంతో మానవ హక్కుల పరిరక్షణకు భారత్ కృషి కొనసాగుతుంది," అని ఐరాసకు భారత శాశ్వత మిషన్ ట్వీట్ చేసింది.