రక్షణ రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా భారత్-ఫ్రాన్స్ (India France relations) కీలక ముందడుగు వేశాయి. సమాచార మార్పిడి; సైనిక విన్యాసాలను (India France military exercise) విస్తృతం చేయడం.. ఇరుదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం.. సముద్ర, అంతరిక్ష, సైబర్ రంగంల్లో సరికొత్త ప్రణాళికలను రూపొందించడంపై అవగాహనకు వచ్చాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, ఫ్రాన్స్ (India France relations) అధ్యక్షుడి దౌత్య సలహాదారు ఎమ్మాన్యూయెల్ బాన్నెతో జరిగిన భేటీలో ఈ మేరకు ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి.
మోదీ విజన్ అయిన 'ఆత్మనిర్భర్ భారత్'కు (Atmanirbhar Bharat scheme) తమ మద్దతు ఉంటుందని ఫ్రాన్స్ స్పష్టం చేసినట్లు పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. రక్షణ రంగంలో పారిశ్రామిక విధానం, సంయుక్త పరిశోధనలు, సాంకేతికత అభివృద్ధి వంటి విషయాల్లో సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా కలిసి ఆకస్ కూటమి (AUKUS France) ఏర్పాటుపై గుర్రుగా ఉన్న ఫ్రాన్స్.. భారత్‌తో రక్షణ రంగంలో వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి (India France relations) ముందుకు రావడం విశేషం.
ఉగ్రవాదం, ఇండోపసిఫిక్పై చర్చ!