భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ సహకారం కోసం భారత్, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు గురువారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా.. భారత ఫ్లైట్ ఫిజీషియన్లకు ఫ్రాన్స్‌లో శిక్షణ అందనుంది.
ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సీఎన్ఈఎస్ అభివృద్ధి చేసి, పరీక్షించి, ప్రస్తుతం వినియోగిస్తున్న పరికరాలను భారత బృందానికి అందుబాటులో ఉంచనుంది. ఈ ఒప్పందం గురించి బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ డ్రియన్ ప్రకటన చేశారు.