తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ఓటింగ్​... భారత్ దూరం

Russia-Ukraine crisis: ఉక్రెయిన్​- రష్యా యుద్ధ పరిణామాలపై స్వతంత్ర విచారణ కమిషన్​ను ఏర్పాటు చేసేందుకు ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలి నిర్వహించిన ఓటింగ్​కు భారత్​ దూరంగా ఉంది.

UNHRC
మానవ హక్కుల మండలి

By

Published : Mar 4, 2022, 6:03 PM IST

Russia-Ukraine crisis: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన మరో ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండిపోయింది. రష్యా చర్యలపై విచారణకు అత్యవసరంగా అంతర్జాతీయ స్వతంత్ర కమిషన్‌ ఏర్పాటు చేయాలన్న తీర్మానంపై సమితి మానవ హక్కుల మండలిలో నిర్వహించిన ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది.

47 సభ్య దేశాలు గల మండలిలో 32 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, రష్యా, ఎరిట్రియా వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్‌, చైనా, పాకిస్థాన్‌ సహా 13 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

రష్యాకు వ్యతిరేకంగా ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి, సర్వప్రతినిధి సభలో నిర్వహించిన రెండు ఓటింగ్‌లలో భారత్‌ పాల్గొనలేదు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details