కొవిడ్-19 బారినపడిన వారిలో చాలా మంది భయంతోనే ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొవిడ్-19 బారినపడే వారిలో తొలి రెండు వారాల్లో గుండెపోటు ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ 'ది లాన్సెట్'లో ప్రచురితమైంది.
కొవిడ్ రోగులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను అంచనా వేసేందుకు స్వీడన్‌లోని ఉమెయా యూనివర్సిటీ పరిశోధకులు ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 14, 2020 వరకు ఓ అధ్యయనం చేపట్టారు. కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన 80వేల మందిని, మరో 3లక్షల 48వేల సాధారణ పౌరుల ఆరోగ్యంతో పోల్చి చూశారు. ఇందులో భాగంగా కొవిడ్-19 బారినపడిన వారిలో తొలి రెండు వారాల్లో గుండె గోడ కండరాలకు సంబంధించిన (గుండెపోటు) సమస్యతో పాటు స్ట్రోక్ ముప్పు మూడు రెట్లు పెరిగినట్లు కనుగొన్నట్టు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఉమెయా యూనివర్సిటీ నిపుణులు ఓస్వాల్డో ఫాన్‌సెకా పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు (Comorbidities), వయసు, లింగము, సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చూసినా.. ఇదే విధమైన ఫలితాలు వచ్చినట్లు చెప్పారు.
అందుకే వ్యాక్సిన్ కీలకం..