తెలంగాణ

telangana

ETV Bharat / international

యాంటీబాడీలకు టోపీ పెడుతున్న వైరస్!

యాంటీబాడీలు కలిగి ఉన్నప్పటికీ కొందరు కొవిడ్-19 రోగులు తీవ్ర అనారోగ్యం బారినపడున్నారు. దీనికి కారణాలు గుర్తించారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. యాంటీబాడీలు కరోనా వైరస్​కు అతుక్కోకుండా సహజసిద్ధ పదార్థాలు నిలువరిస్తున్నట్లు తెలిపారు.

antibodies
యాంటీబాడీలు, కొవిడ్​ వైరస్

By

Published : Apr 26, 2021, 8:53 AM IST

కరోనా వైరస్​ను కట్టడి చేసే యాంటీబాడీలను చాలా అధికస్థాయిలో కలిగి ఉన్నప్పటికీ.. కొవిడ్-19 బాధితుల్లో కొందరు తీవ్ర అనారోగ్యం బారినపడుతుంటారు. దీనికి కారణాలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ యాంటీబాడీలు కరోనా వైరస్​కు అతుక్కోకుండా సహజసిద్ధ పదార్థాలు నిలువరిస్తున్నట్లు తేల్చారు. బ్రిటన్​లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇనిస్టిట్యూట్, ఇంపీరియల్ కాలేజీ లండన్, కింగ్స్ కాలేజీ లండన్, యూనివర్సిటీ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

ప్రపంచవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో.. యాంటీబాడీలను వైరస్ ఎలా ఏమారుస్తోందని తెలుసుకోవడం చాలా కీలకం. ఈ అంశంలో శాస్త్రవేత్తలకు అంతుబట్టని అంశాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఇన్​ఫెక్షన్​ను నియంత్రించడంలో రోగ నిరోధక వ్యవస్థ ప్రదర్శించే సామర్థ్యం, యాంటీబాడీల స్పందన వంటి అంశాల్లో అనేక వైరుద్ధ్యాలు ఉంటున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిని నిగ్గు తేల్చేందుకు వారు క్రయో-ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, ఎక్స్​రే క్రిస్టలోగ్రఫీ సాయంతో పరిశీలనలు సాగించారు.

కరోనా వైరస్​లోని కొమ్ములాంటి స్పైక్​ ప్రోటీన్.. బిలువర్డిన్, బిలురుబిన్ అనే పదార్థాలకు బలంగా అంటుకుంటున్నట్లు గుర్తించారు. ఫలితంగా స్పైక్​ ప్రోటీన్లు అసాధారణ స్థాయిలో పచ్చరంగులోకి మారిపోతున్నాయని తేల్చారు. దీనివల్ల ఈ కొమ్ము ఆకృతులను యాంటీబాడీలు అతుక్కోలేకపోతున్నాయని పేర్కొన్నారు. అవి అతుక్కుంటేనే వైరస్​ నిర్వీర్యమవుతుంది. ఇలా.. అంటుకోలేకపోతున్న యాంటీబాడీలు 30-50 శాతం మేర ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కరోనా కట్టడిలో స్వీయనియంత్రణే కీలకం

ABOUT THE AUTHOR

...view details