తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఇప్పట్లో మనల్ని వదిలేలా లేదు: డబ్ల్యూహెచ్​ఓ - కరోనా వైరస్ జాగ్రత్తలు

కరోనా వైరస్ ముగింపును అంచనా వేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ మహమ్మారి మనతోనే జీవించే అవకాశం అధికంగా ఉందని స్పష్టం చేసింది. అయితే వ్యాక్సిన్​ను కనిపెట్టగలమని ఆశాభావం వ్యక్తం చేసింది.

VIRUS-WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ

By

Published : May 14, 2020, 10:38 AM IST

అన్ని దేశాలను హడలెత్తిస్తోన్న కరోనా వైరస్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) స్పష్టం చేసింది. కరోనా.. మనతోపాటు జీవించేందుకు అవకాశం ఎక్కువ ఉందని సంస్థ ఎమర్జెన్సీస్ చీఫ్ మైఖేల్ ర్యాన్​ వెల్లడించారు.

"వైరస్ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లే అవకాశం లేదు. కరోనా బారిన పడినవారి సంఖ్య ఇప్పటివరకు చాలా తక్కువే. వ్యాక్సిన్ లేకపోతే ఈ వ్యాధికి రోగ నిరోధక శక్తి సంపాదించుకునేందుకు ఏళ్ల సమయం పడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది."

- మైఖేల్ ర్యాన్​, డబ్ల్యూహెచ్​ఓ

గతంలో వచ్చిన హెచ్​ఐవీ తరహా నావెల్​ వ్యాధులు ఇప్పటికీ అంతం కాలేదని.. కానీ అత్యుత్తమ చికిత్స విధానాలు రూపొందించుకోగలిగామని ర్యాన్ అన్నారు. కరోనా వైరస్​కు కూడా ఇలాగే జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అయితే కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయగలమని ర్యాన్​ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యాక్సిన్​ డోసుల ఉత్పత్తి, ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయాలన్నారు.

ఇదీ చూడండి:డబ్ల్యూహెచ్‌ఓను బెదిరించిన చైనా- అసలేం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details