తెలంగాణ

telangana

ETV Bharat / international

జర్మనీ నుంచి దిల్లీ చేరిన ఆక్సిజన్ కంటైనర్లు

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి నాలుగు ఆక్సిజన్ కంటైనర్లను తీసుకొచ్చినట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ప్రకటించింది. ఆదివారం ఇవి దిల్లీలోని హిండన్ వైమానిక స్థావరానికి చేరుకున్నట్టు స్పష్టం చేసింది.

IAF
ఐఏఎఫ్

By

Published : May 3, 2021, 9:05 AM IST

కరోనా వైరస్ రెండో దశ విజృంభణతో దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్​కు పలు దేశాలు సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో జర్మనీ చేరింది. ఈ మేరకు ఆ దేశం అందించిన నాలుగు ఆక్సిజన్​ కంటైనర్లను ఫ్రాంక్​ఫర్ట్ విమానాశ్రయం నుంచి తీసుకొచ్చినట్లు భారత వైమానిక దళం ఓ ప్రకటనలో పేర్కొంది.

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆక్సిజన్ కంటైనర్లు

అంతేకాకుండా.. బ్రిటన్​లోని బ్రైజ్ నార్టన్ నుంచి 450 ఆక్సిజన్ సిలిండర్లను తమిళనాడులోని చెన్నై వాయు స్థావరానికి తరలించినట్లు వెల్లడించింది. ఇందుకుగాను సీ-17 విమానాన్ని ఉపయోగించింది ఐఏఎఫ్.

అలాగే భారత్​లోనూ ఆక్సిజన్ సరఫరాకు ఆదివారం పలు విమానాలను పంపినట్లు ఐఏఎఫ్ ప్రకటించింది. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి ఛండీగఢ్​కు రెండు, జోధ్​పూర్-జామ్​నగర్​, దిల్లీ-రాంచీ, ఇందోర్-జామ్​నగర్​ల మధ్య రెండు చొప్పున క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు సరఫరా చేసినట్లు తెలిపింది.

కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ పంపిణీని వేగవంతం చేసేందుకు ఏప్రిల్ 23 నుంచి నిరంతరాయంగా సేవలందిస్తోంది ఐఏఏఫ్. మెడికల్ ఆక్సిజన్​తో పాటు.. కొవిడ్ ఆసుపత్రులకు అత్యవసర ఔషధాలతో పాటు.. అవసరమైన పరికరాలను సరఫరా చేస్తోంది.

ఇవీ చదవండి:బ్రిటన్​ నుంచి భారత్​కు మరో 1000 వెంటిలేటర్లు

దుబాయ్, సింగపూర్‌ నుంచి ఆక్సిజన్ కంటైనర్లు

జర్మనీ, అమెరికా నుంచి భారత్​కు సాయం

ABOUT THE AUTHOR

...view details