కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ఈ ప్రభావం బాలబాలికల పోషకాహార లోపంపై పడింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 68 వేల మంది పోషకాహార లోపంతో మరణించే అవకాశం ఉన్నట్లు 30 అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన అధ్యయనం వెల్లడించింది. 'స్టాండింగ్ టుగెదర్ ఫర్ న్యూట్రిషన్' అనే సంస్థ చేపట్టిన ఈ ఫోన్ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
పోషకాహార లోపంతో భారీగా చిన్నారుల మరణాలు! - malnourished
పోషకాహార లోపంతో లక్షా 68 వేల మంది చిన్నారులు మరణించే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. స్టాండింగ్ టుగెదర్ ఫర్ న్యూట్రిషన్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో ఇందుకు సంబంధించిన పలు అంశాలు వెల్లడయ్యాయి.
పోషకాహారలోపంతో భారీగా చిన్నారుల మరణాలు!
సర్వే వివరాలు ఇలా..
- సుమారు కోటీ 19 లక్షల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ఇందులో ఎక్కువ భాగం దక్షిణ ఆసియా, ఆఫ్రికాల్లోనే ఉన్నారు.
- అప్పుడే పుడుతున్న చిన్నారుల్లో కూడా పోషకాహార లోపం ఉంటుంది. దీని వల్ల ఓ తరం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తోంది.
- కరోనావైరస్కు ముందు ప్రపంచ దేశాలు పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడి అనూహ్య విజయం సాధించాయి.
- 2000 సంత్సరంలో 199.5 మిలియన్ల మంది బాధితులు ఉండగా.. 2019 నాటికి ఈ సంఖ్య 144 మిలియన్లకు తగ్గింది.
- గతేడాదిలో నమోదైన కేసుల సంఖ్యతో పోల్చుకుంటే ఈ ఏడాది వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా.
- పోషకాహార లోపానికి వ్యతిరేకంగా భారీగా నిధులు సేకరించడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 300 కోట్లు సేకరించారు.
- ప్రపంచంలో పోషకాహారలోపం ఎక్కువగా ఉన్న దేశాల్లో పాకిస్థాన్ ముందుంది.
- పోషకాహారలోపాన్ని అరికట్టే దిశగా 2025 నాటికి రూ. 220 కోట్ల ఖర్చు చేయనున్నట్లు వెల్లడి.