అది యుద్ధరంగం. ఇరువైపులా సైనికులు తుపాకులు ఎక్కుపెట్టి సమరానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధభేరి మోగింది. అంతే కొదమ సింహాల్లా సైనికులు తలపడ్డారు. భీకరంగా పోరాడుతున్నారు. కానీ... ఎక్కడా రక్తపాతం లేదు. పక్కనున్న ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తున్నారు. ఏమిటీ..! యుద్ధం చేస్తుంటే ప్రోత్సహించడం ఏంటని అనుకుంటున్నారా..! కంగారు పడకండి. ఇదేమీ నిజమైన యుద్ధం కాదు.
భీకర యుద్ధం... వెల్లివిరిసిన సంతోషం
ఏప్రిల్ 1849 నాటి ఆస్ట్రియా-హంగేరీ యుద్ధ విజయాన్ని గుర్తు చేసుకుంటూ హంగేరీ ప్రజలు ప్రత్యేక వేడుకలు జరుపుకున్నారు. అలనాటి ఆయుధాలు, సైనిక దస్తులు ధరించి సరదాగా యుద్ధవిన్యాసాలు ప్రదర్శించారు.
భీకర యుద్ధం... వెల్లివిరిసిన సంతోషం
1849 ఏప్రిల్లో హంగేరియన్ రివల్యూషనరీ సైన్యం... స్వాతంత్య్రం కోసం ఆస్ట్రియా సామ్రాజ్యానికి చెందిన హాప్స్బర్గ్ దళాలతో పోరాడింది. రష్యా సైన్య సహకారంతో స్వేచ్ఛను పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ హంగేరియన్ ప్రజలు ప్రతి సంవత్సరం టాపియోబిక్సేలో యుద్ధ విన్యాసాలు ప్రదర్శిస్తూ వేడుకను జరుపుకుంటారు.