తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆర్థిక సంక్షోభంతో దుకాణాలనే దోచేస్తున్నారు..!

కరీబియన్​ దేశం హైతీలో ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు జోవెనల్​ మైసీనే కారణమని ఆందోళనకు దిగారు ప్రజలు. పెద్ద ఎత్తున ప్రధాన వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు. పనిలో పనిగా నిత్యావసరాల కోసం కనిపించిన దుకాణాలను దోచుకున్నారు. అడ్డుకున్న పోలీసులపై తిరగబడ్డారు.

ఆర్థిక సంక్షోభంతో దుకాణాలనే దోచేస్తున్నారు..!

By

Published : Sep 28, 2019, 1:43 PM IST

Updated : Oct 2, 2019, 8:28 AM IST

ఆర్థిక సంక్షోభంతో దుకాణాలనే దోచేస్తున్నారు..!

గ్యాస్‌ సంక్షోభంతో ఆర్థిక ఇక్కట్లలో చిక్కుకున్న కరీబియన్‌ దేశం హైతీలో ప్రజలు లూటీలకు తెగబడ్డారు. నిత్యావసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడటం వల్ల రాజధాని పోర్టా ప్రిన్స్‌లో కనిపించిన ప్రతి దుకాణాన్ని దోచుకున్నారు.

హైతీ ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు జోవెనల్‌ మైసీ కారణం అంటూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు ప్రజలు. ప్రధాన వీధుల్లోకి చేరి ఆందోళనలు చేశారు. పనిలో పనిగా దోపిడీలకు దిగారు. పోర్టా ప్రిన్స్‌లో పలు దుకాణాల్లోకి చొరబడి నిత్యావసరాలను దోచుకెళ్లారు.

అడ్డుకున్న పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించగా.. ఆందోళనకారులు పలు దుకాణాలు, వాహనాలకు నిప్పంటించారు.

ఇదీ చూడండి: అమెరికాలో భారత సంతతి 'సిక్​ పోలీస్'​ మృతి

Last Updated : Oct 2, 2019, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details