తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎయిడ్స్​ భూతానికి 'సూది మందు'!

మానవజాతిని పట్టిపీడిస్తోన్న హెచ్​ఐవీ, ఎయిడ్స్​లను సమర్థవంతంగా నిరోధించడానికి పరిశోధకులు కృషిచేస్తున్నారు. లండన్​లోని 'క్వీన్​ మేరీ విశ్వవిద్యాలయం' శాస్త్రజ్ఞులు సరికొత్త హెచ్​ఐవీ నిరోధక ఇంజెక్షన్, మందులను తయారు చేశారు. వీటిని ఎఫ్​డీఏ (అమెరికా), యూరోపియన్ మెడికల్​ ఏజెన్సీలు ఆమోదించాల్సి ఉంది.

By

Published : Mar 9, 2019, 2:42 PM IST

Updated : Mar 10, 2019, 4:31 PM IST

ఎయిడ్స్​పై పరిశోధనలు ఫలించేనా?

ఎయిడ్స్​పై పరిశోధనలు ఫలించేనా?
'హెచ్​ఐవీ' ఈ మాట వింటేనే హడలిపోతాం. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా ఈ వ్యాధిని సమర్థవంతంగా నిరోధించగలిగే మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి హెచ్​ఐవీ వైరస్​ను, ఎయిడ్స్​ను గానీ పూర్తిగా నయం చేయలేవు. కానీ వైరస్​ వృద్ధి చెందకుండా నిరోధిస్తాయి.

ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న చికిత్స విధానాల్లో హెచ్​ఐవీ/ ఎయిడ్స్​ రోగి ప్రతిరోజూ మూడు రకాల మందులు వేసుకోవాలి. మతిమరుపు, మానసిక స్థితి సరిగ్గా లేనివారు, మత్తు మందులకు అలవాటు పడినవారు, సరైన జీవన విధానం పాటించని వారు క్రమం తప్పకుండా ఈ మందులు వాడడం కష్టం.

దీనికి విరుగుడుగా నేడు సరికొత్త వైద్యం అందుబాటులోకి వచ్చింది. నెలకు కేవలం రెండు యాంటీ రెట్రో వైరల్​ ఇంజెక్షన్​లు తీసుకుంటే సరిపోతుంది. ఫలితంగా రోగి శరీరంలో హెచ్​ఐవీ వైరస్​ పెరగకుండా సమర్థవంతంగా నిరోధించవచ్చు. ఫలితంగా హెచ్ఐవీ సోకినవారు సైతం అందరిలాగే సాధారణ జీవితాన్ని అనుభవించగలుగుతారు.

"ఇంతకు మునుపు రోగులు వాడిన హెచ్​ఐవీ మందుల వలన కిడ్నీ, ఎముకల సమస్యలు వచ్చేవి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన హెచ్​ఐవీ నిరోధక మందులు గర్భిణీలు సైతం తీసుకోవచ్చు. ఇవి పూర్తిగా సురక్షితం."

- చోలే ఆర్కిన్​, హెచ్​ఐవీ ఫిజీషియన్​, క్వీన్​ మేరీ విశ్వవిద్యాలయం

సరికొత్త పరిశోధనలు...

ప్రస్తుతం 'హెచ్​ఐవీ' నిరోధానికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రజ్ఞులు 'యూంటీరెట్రో వైరల్​ థెరపీ లాంగ్​ యాక్టింగ్​ అప్రెషన్​' (ఏటీఎల్​ఏఎస్​), ఫస్ట్​ లాంగ్ యాక్టింగ్​ ఇంజెక్టబుల్​ రెజిమెన్​ (ఎఫ్​ఎల్​ఏఐఆర్​) విధానాలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో సుమారు 11 వందల మంది స్త్రీ,పురుషులు పాల్గొన్నారు. వీరికి టాబ్లెట్​లకు బదులు, ప్రతి రెండు నెలలకు ఒకసారి రెండు ఇంజెక్షన్​లు ఇస్తారు. వీటిని క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల హెచ్ఐవీ వైరస్​ వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

"రోగిలోని హెచ్​ఐవీని పూర్తిగా నిరోధించగలిగితే, ఇక ఎంతమాత్రమూ అతనికి ఎయిడ్స్​ సంక్రమించదు. అతను పూర్తి ఆరోగ్యకర జీవితం గడపగలుగుతాడు. అయితే అతను/ఆమె క్రమం తప్పకుండామందులు వాడాల్సి ఉంటుంది."_ గ్రాహమ్​ కుక్​, అంటువ్యాధుల నిపుణుడు, ఇంపీరియల్​ కాలేజ్​, లండన్​

ఈ సరికొత్త మందులు కొంతమందిలో హైపర్​ సెన్సిటివిటీ, డిప్రెషన్​ కలిగిస్తున్నట్లు పరిశోధకులు గ్రహించారు. అయితే ఈ లక్షణాలు కేవలం 3 శాతం రోగుల్లో మాత్రమే కనిపిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

ఆమోదించాల్సి ఉంది...

లండన్​లోని క్వీన్​ మేరీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్​ నెబ్రాస్కా శాస్త్రజ్ఞులు ఈ హెచ్​ఐవీ, ఎయిడ్స్ నిరోధక పరిశోధనలను చేపట్టారు. దిగ్గజ ఫార్మా సంస్థలు జీఎస్​కే, పీ ఫైజర్​లు సంయుక్తంగా నెలకొల్పిన వీఐఐవీ హెల్త్​కేర్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు సాగుతున్నాయి. వీరు తయారుచేసిన ఇంజెక్షన్​ను 'ఎఫ్​డీఏ' (ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్) (అమెరికా), యూరోపియన్ మెడికల్​ ఏజెన్సీలు ఆమోదించాల్సి ఉంది.

Last Updated : Mar 10, 2019, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details