జర్మనీ మ్యూనిచ్‌లో అడాల్ఫ్ హిట్లర్ జ్ఞాపికల వేలంపాట అట్టహాసంగా జరిగింది. దీనిపై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తం అయినప్పటికీ నాజీ నియంత జ్ఞాపికలు వేల యూరోలు వసూలు చేశాయి.
హెర్మెన్ హిస్టోరికా ఆక్షన్ హౌస్ ప్రకారం... వేలంపాటలో హిట్లర్‌కు ఎంతో ఇష్టమైన టోపీ 50 వేల యూరోలకు అమ్ముడుపోయింది. హిట్లర్ భాగస్వామి ఎవా బ్రౌన్ దుస్తులు కూడా వేలరూపాయల ధర పలికాయి.
'మైన్ కాంఫ్'
హిట్లర్ రాసిన 'మైన్ కాంఫ్' గ్రంథాన్ని ఓ వ్యక్తి 1,30,000 యూరోలకు కొనుగోలుచేశాడు. వెండిపూతతో గద్ద, నాజీ పార్టీ చిహ్నం స్వస్తిక్‌తో ఉన్న ఈ పుస్తకం సీనియర్ నాజీ హెర్మన్ గోరింగ్కు చెందినది.
రెండో ప్రపంచయుద్ధంలో ప్రముఖపాత్ర వహించిన నాజీ నాయకులు హెన్రిచ్ హిమ్లెర్, రుడాల్ఫ్ హెస్లకు చెందిన వ్యక్తిగత వస్తువులు, దుస్తులు కూడా వేలంలో మంచి ధరకు అమ్ముడుపోయాయి.