ఒకప్పుడు భారత్‌ను పాలించిన దేశంలో ప్రస్తుతం అత్యంత ధనికులు ఎవరంటే మన వాళ్లే. భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' బ్రిటన్ అత్యంత ధనికుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. మరి వారి ఆస్తి ఎంతనుకుంటున్నారు. అక్షరాల 22 బిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ. 19 లక్షల కోట్లు మరి. 18.66 బిలియన్ పౌండ్లతో ముంబయిలో జన్మించిన రూబెన్ సోదరులు రెండో స్థానంలో నిలిచారు.
హిందుజా... వ్యాపార శైలి విభిన్నం
హిందుజా వ్యాపార సంస్థను నిర్వహిస్తోన్న శ్రీచంద్, గోపిచంద్ హిందుజాలు గతేడాది కాలంలో 1.35 బిలియన్ లాభాల్ని సాధించి ప్రథమ స్థానానికి ఎగబాకారు. ఇంతకు ముందు 2014, 2017 సంవత్సరాల్లోనూ బ్రిటన్ ధనికుల్లో హిందుజా గ్రూప్ అధినేతలే ప్రథమ స్థానంలో నిలిచారు. శ్రీచంద్, గోపిచంద్ మరో ఇద్దరు సోదరులు ప్రకాశ్, అశోక్‌లతో కలసి ప్రపంచవ్యాప్తంగా 50 కంపెనీలను నిర్వహిస్తున్నారు. 2018లో ఈ కంపెనీలకు 40 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని సాధించి పెట్టారు. హిందుజా వ్యాపారాల్ని ముంబయి కేంద్రంగా 1914లో వారి తండ్రి పరమానంద్ స్థాపించారు.
⦁ ఎలిజబెత్ రాణి నుంచి ఇళ్లు కొనుగోలు
హిందుజా సోదరులకు లండన్‌లోని కార్ల్టన్ హౌస్ టెర్రస్‌లో నాలుగు ఇళ్లున్నాయి. వీటిని ఎలిజబెత్ రాణి నుంచి 2006 లో కొనుగోలు చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ కార్యాలయాన్ని గతంలో కొనుగోలు చేశారు.
⦁ అనేక వ్యాపారాలు