తెలంగాణ

telangana

ETV Bharat / international

హైహీల్స్​లో స్వలింగ సంపర్కుల పరుగు పందెం!

సాధారణ పరుగు పందేలు అందరూ చూసి ఉంటారు. కానీ స్పెయిన్​లో ఓ స్వలింగ సంపర్కుల సంఘం మాత్రం కాస్త విభిన్నంగా ప్రయత్నించింది. 20 ఏళ్లుగా సాగుతున్న స్వలింగ సంపర్కుల ఆత్మగౌరవ ఉత్సవాల్లో భాగంగా.. సభ్యులు 'హైహీల్స్ పరుగు పందెం' నిర్వహించుకుని ఆనందించారు.

హైహీల్స్​లో స్వలింగ సంపర్కుల పరుగు పందెం!

By

Published : Jul 6, 2019, 2:04 PM IST

హైహీల్స్ వేసుకుని స్వలింగ సంపర్కుల పరుగు
15 సెంటీమీ టర్లకు మించిన హైహీల్స్ వేసుకుని, వీధుల్లో పోటీ పడి పరుగులు తీశారు మాడ్రిడ్ స్వలింగ సంపర్కుల సంఘం సభ్యులు. స్పెయిన్​లో 20 ఏళ్లుగా కొనసాగుతున్న స్వలింగ సంపర్కుల ఆత్మగౌరవ ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈసారీ విగ్గులు, వింత దుస్తులు ధరించి 'గే'లందరూ సందడి చేశారు. హై హీల్స్​ రేస్​లో గెలిచిన వారికి 350 యూరోలు అంటే సుమారు 27 వేల రూపాయల నగదు బహుమతి ఇచ్చి ప్రోత్సహించారు.

"ఇది ఈ ప్రాంతపు పండుగ.. లెవపీస్​, లా లాటినా ప్రాంతాల్లో ఇలాంటి పండుగలున్నాయి.
-చెమా, బార్​ నిర్వాహకుడు.

ఈ 'గే' పండుగ వీధుల్లో ప్రజలకు ఆటంకం కలగకుండా నగరానికి దూరంగా జరుపుకోవాలని స్థానిక అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. కానీ ఆ పండుగను చూసేందుకు వచ్చే వీక్షకులు మాత్రం వీధుల్లో జరిగితేనే సందడిగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

"ఈ ఉత్సవాలను నగరానికి దూరంగా ఉంచమనడంలో అర్థంలేదు. వీధుల్లో జరపడమే మంచి ఆలోచన. చూడండి వీధుల్లో ఈ వేడుక వల్ల ఎంత మంది వ్యాపారులు లాభం పొందుతున్నారో. మరెందుకు ఉత్సవాలను బయటెక్కడికో తరలించడం?" -బిల్లీ, వీక్షకుడు.

ఇదీ చూడండి:'హాట్​డాగ్​' తిండిబోతు విజేతలు జోస్, మికీ

ABOUT THE AUTHOR

...view details