ప్రపంచంలో అనేక రకాల పోటీలు జరుగుతుంటాయి. కానీ, గుమ్మడికాయల పోటీల (Pumpkin Weight Record) గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? యూరప్‌లో ఏటా అక్టోబర్ మాసంలో గుమ్మడికాయల్ని సాగు చేసే రైతుల మధ్య యూరోపియన్ పంప్‌కిన్ వేయింగ్ ఛాంపియన్‌షిప్ పేరుతో (Pumpkin Weight Record) పోటీ నిర్వహిస్తుంటారు. యూరప్ వ్యాప్తంగా ఉన్న గుమ్మడికాయలు సాగు చేసే రైతులు వారు పండించిన విభిన్న రకాల గుమ్మడికాయల్ని ఈ పోటీలో ప్రదర్శిస్తుంటారు.
తాజాగా జర్మనీలోని లుడ్విగ్స్‌బర్గ్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో ఇటలీలోని టస్కానీ ప్రాంతానికి చెందిన ఓ రైతు పండించిన టన్నుకుపైగా బరువున్న గుమ్మడికాయ (Pumpkin Weight Record) విజేతగా నిలిచింది. దాని బరువు సరిగ్గా 1,217.5కిలోలు. అందుకే ప్రపంచంలోనే అత్యధిక బరువున్న గుమ్మడికాయగానూ రికార్డు సృష్టించింది.