90వ దశకంతో పోల్చుకుంటే ప్రస్తుతం భారతీయుల ఆయుర్దాయం పదేళ్లు పెరిగిందని.. ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. భారత్‌లో 1990లో ఆయుర్దాయం 59 ఏళ్ల ఆరు నెలలు ఉండగా.. 2019లో అది 70 ఏళ్ల 8 నెలలకు పెరిగిందని ఓ అధ్యయనం వెల్లడించినట్లు లాన్సెట్ ప్రచురించింది.
అయితే రాష్ట్రాల మధ్య అసమానతలు ఉన్నాయని తెలిపింది లాన్సెట్. కేరళలో గరిష్ఠంగా ఆయుర్దాయం 77 ఏళ్ల 3 నెలలు ఉండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో కనిష్ఠంగా 66 ఏళ్ల 9 నెలలు ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో 286 మరణాలకు గల కారణాలు, 369 వ్యాధులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.