బ్రిటన్ రాచరికపు హోదాను వదులుకుని సంచలనం సృష్టించిన ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘాన్ మెర్కెల్‌లు తాజాగా తమ సామాజిక మాధ్యమ ఖాతాలనూ ముగించాలని నిర్ణయించుకున్నారు. ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది.
సామాజిక మాధ్యమాలను వీడనున్న హ్యారీ దంపతులు - సామాజిక మాధ్యమాల్ని బ్రిటన్ యువరాజు హ్యీరీ
ప్రిన్స్ హ్యారీ అతని భార్య మేఘాన్ మెర్కెల్‌లు సామాజిక మాధ్యమాల్లో తమ ఖాతాలను ముగించనున్నారు. తమ ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకుంటున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారి సన్నిహితులు తెలిపారు.
@ససెక్రాయల్ పేరిట ఉన్న ఈ దంపతుల ఇన్స్టాగ్రామ్ ఖాతాకు కోటికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. వీరిని అనుసరించే వాళ్లు ఉన్నట్టే, విమర్శించే వాళ్లకూ సోషల్ మీడియాలో కొదువలేదు. పెళ్లికి ముందు నటిగా ఉన్న తనపై ఇప్పటికీ ట్రోలింగ్ జరుగుతోందని మేఘాన్ మెర్కెట్ ఓ సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. అదీకాక ఇకపై వ్యక్తిగత హోదాల్లో అమెరికా వెళ్లి తమ ఇష్టమైన రంగాల్లో రాణించానుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ప్రారంభించిన ఖాతాలన్నీ వీడాలనుకుంటున్నట్లు వారి సన్నిహితులు తెలిపారు.
ఇదీ చదవండి:నేడు దిగువ సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం