రష్యాలోని నిజ్ని నోవ్గార్డ్లో మడగాస్కర్ జూకు చెందిన చిన్నారి పులి పిల్ల.. అదే జూలోని ఓ శునకంతో చెలిమి చేసింది. ఈ బుజ్జి పులిపిల్ల, దాని ఇద్దరు సోదరులు ఏప్రిల్లో పురుడు పోసుకున్నాయి. కానీ వాటి తల్లి వాటిని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు జూ సిబ్బంది. మేకపాలలో ప్రొటీన్లు, ఇతర పోషకాలు కలిపి వాటికి పట్టిస్తున్నారు. చిన్నచిన్నగా మాంసాహారం అలవాటు చేస్తున్నారు.
కానీ, కొద్ది రోజుల క్రితమే వీటిలో రెండు పులిపిల్లలను ఇతర జూలకు పంపించేశారు సిబ్బంది. దీంతో ఈ బుజ్జి పులిపిల్ల ఒంటరైపోయింది. తన మనసులోని భారాన్ని అర్ధం చేసుకున్న జూ సిబ్బంది.. పెంపుడు కుక్క లీలూని ఆ పులిపిల్లకు దగ్గర చేశారు. కొద్ది రోజుల్లోనే ఆ రెండింటి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది.