ఇటలీ తూర్పు తీర ప్రాంతం భారీ తుపాను ధాటికి గజగజా వణికిపోయింది. వడగళ్ల వానలో చిక్కుకుని 18 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. పెస్కరా నగరంలో ప్రధాన వీధుల్లోకి వరద నీరు చేరింది.
వడగళ్ల వానలో చిక్కుకోవడం వల్ల బాధితుల తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని పెస్కరాలోని ఓ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ గదికి మార్చి, చికిత్స అందిస్తున్నారని ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఎల్ఏ తెలిపింది.