తెలంగాణ

telangana

ETV Bharat / international

గన్​తో వచ్చి.. నానా బీభత్సం సృష్టించాడు - జార్జియాలో ఓ ఆగంతకుడు కలకలం

జార్జియాలోని ఓ బ్యాంక్​లో అగంతుకుడు నానా బీభత్సం చేశాడు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఆ దుండగుడు తుపాకీతో అక్కడి వారిని బెదిరించాడు. పలువురిని అదుపులోకి తీసుకొని డబ్బులు డిమాండ్​ చేశాడు.

Gunman takes hostages at bank in Georgia
గన్​తో వచ్చి.. నానాభీభత్సం సృష్టించాడు

By

Published : Oct 22, 2020, 8:21 PM IST

తుపాకీతో బెదిరిస్తున్న అగంతకుడు

మాజీ సోవియట్‌ దేశం జార్జియాలో ఓ అగంతుకుడు కలకలం సృష్టించాడు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఆ దుండగుడు.. అక్కడి జుగ్-డిడి ప్రాంతంలోని ఓ బ్యాంకులో చొరబడి విధ్వంసం సృష్టించాడు. అంతేకాకుండా పలువురు ఉద్యోగులు, ఖాతాదారులను అదుపులోకి తీసుకొన్నాడు. అతడి చేతిలో గన్​ చూసిన ఖాతాదారులు.. భయంతో నేలపై సాగిలపడిపోయారు.

అగంతుకుడు బ్యాంకులో 19 మందిని బందీలుగా చేసుకొని చర్చల అనంతరం 16 మందిని విడిచిపెట్టాడు. రక్షణ కోసం ముగ్గురిని తన వెంట తీసుకువెళ్లి.. తర్వాత వారిని కూడా విడిచిపెట్టాడు. దుండగుడు 5లక్షల డాలర్లు డిమాండ్‌ చేసినట్లు జార్జియా టీవీ ఛానెళ్లు తెలిపాయి. దుండగుడు ఎవరన్నది తెలియరాలేదు.

ఇదీ చూడండి: చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్​కు అమెరికా ఆయుధాలు

ABOUT THE AUTHOR

...view details