స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌కు 'అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి' వరించింది. పర్యావరణ పరిరక్షణకై థన్‌బర్గ్ చేస్తున్న పోరాటానికి ఈ అవార్డు లభించింది.
స్పెయిన్‌లో జరగనున్న ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనడానికి పయనమైన థన్‌బర్గ్... ఈ అవార్డును స్వయంగా స్వీకరించలేకపోయారు. కానీ అవార్డు దక్కడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. థన్‌బర్గ్‌కు బదులుగా ఈ బహుమతిని జర్మన్‌కు చెందిన పర్యావరణవేత్త లూయిసా మేరీ అందుకున్నారు.