ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ కరోనా నుంచి కోలుకుంటామని... ఆశాభావం వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్. బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్న 'డెక్సమెథసోన్' జనరిక్ ఔషధం కరోనా రోగుల్లో వైరస్ తీవ్రతను తగ్గిస్తున్నట్లు ప్రాథమిక ప్రయోగాల్లో నిరూపితమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా దీనిని ధ్రువీకరించింది.
ఈ ఔషధాన్ని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. కాగా తీవ్ర అనారోగ్యానికి గురైన రోగులు కోలుకోవడానికి ఇస్తున్న ఈ జనరిక్ ఔషధం... వైరస్‌కు మందు మాత్రం కాదని హెచ్చరించారు డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్.