తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచ మీడియాలో 'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​కు పెద్దపీట - దిశ కేసు తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన 'దిశ' హత్యాచార కేసు నిందితుల ఎన్​కౌంటర్​ను ప్రపంచ మీడియాలో సైతం పతాక శీర్షికల్లో చేర్చారు. కేసు పూర్వ పరాలను సమగ్రంగా ప్రచురించాయి పలు వార్తా సంస్థలు.

ENCOUNTER
ప్రపంచ మీడియాలోనూ ప్రముఖంగా 'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​

By

Published : Dec 7, 2019, 6:22 AM IST

Updated : Dec 7, 2019, 6:35 AM IST

హైదరాబాద్​ యువ వైద్యురాలు 'దిశ' అత్యచారం, హత్య కేసులో నిందితుల ఎన్​కౌంటర్​కు ప్రపంచ మీడియా ప్రముఖంగా కవరేజీని ఇచ్చింది. ప్రధానంగా ప్రజలు మద్దతు తెలపడం.. సామాజిక కారక్యకర్తలు, న్యాయకోవిదుల అభిప్రాయాలను ఎత్తి చూపించాయి పలు వార్తా సంస్థలు.

అమెరికా పత్రికలు..

వాషింగ్టన్‌ పోస్ట్‌: మహిళలు, బాలికలపై దారుణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. నిందితుల ఎన్‌కౌంటర్‌పై భారత్‌లో సర్వత్రా హర్షం వ్యక్తమైనట్లు పేర్కొంది. అయితే పోలీసులు న్యాయపరిధిని దాటి ‘ఎన్‌కౌంటర్‌’ చేశారంటూ సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు అభిప్రాయపడినట్లు కథనంలో ప్రచురించింది.

న్యూయార్క్‌ టైమ్స్‌: ఈ హఠాత్పరిణామం షాక్‌కు గురి చేసిందంటూ.. పోలీసు అధికారులు హైదరాబాద్‌లో హీరోలుగా ప్రశంసలు పొందుతున్నట్లు పేర్కొంది.
సీఎన్‌ఎన్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనను మ్యాప్‌లో చూపించింది. దిశపై దారుణం అనంతరం వెల్లువెత్తిన ఆందోళనలను ప్రస్తావించింది. బాధితురాలి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పేర్కొంది.

హఫింగ్టన్‌పోస్ట్‌: 2008లో సజ్జనార్‌ వరంగల్‌ ఎస్పీగా ఉన్న సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో పోలుస్తూ కథనం ఇచ్చింది. అప్పట్లో దుండగులు జరిపిన ఆమ్లదాడిలో గాయపడిన ప్రణీత (అమెరికాలోని డెన్వర్‌లో నివసిస్తున్నారు)తో కొద్ది రోజుల క్రితం చేసిన ముఖాముఖిని ఈ సందర్భంగా ప్రచురించింది.

సీబీఎస్‌ న్యూస్‌:ఎన్‌కౌంటర్‌ ఘటనను ప్రముఖంగా ఇచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తల అభిప్రాయాలను ప్రచురించింది. భారత్‌లో 2017లో 33 వేలకు పైగా అత్యాచారాలు జరిగిన అంశాన్ని ప్రస్తావించింది.

యూఎస్‌ఏ టుడే:దేశవ్యాప్తంగాను, ప్రధానంగా హైదరాబాద్‌లో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

బ్రిటిష్‌ మీడియా..

బీబీసీ:ఎన్‌కౌంటర్‌పై సామాజిక మాధ్యమాల్లో సంబరాలు చేసుకొంటున్నట్లు పేర్కొంది. పోలీసులను చాలామంది ప్రశంసిస్తున్నట్లు తెలిపింది. సత్వర న్యాయం జరిగిందని భావించడమే ఈ సంబరాలకు కారణంగా పేర్కొంది. 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మహిళపై నేరాలు ఆగడం లేదని పేర్కొంది.

ది గార్డియన్‌: దిశపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైనట్లు తెలపింది. ఎన్‌కౌంటర్‌తో సత్వర న్యాయం జరిగిందంటూ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారన్న విమర్శలొస్తున్నట్లు కథనంలో పేర్కొంది.

ఖలీజ్‌ టైమ్స్‌ (దుబాయ్‌): ఎన్‌కౌంటర్‌పై ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. న్యాయం జరిగిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినట్లు తెలిపింది.
ది టెలిగ్రాఫ్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనను, పూర్వాపరాలను ఇస్తూ సామాజిక మాధ్యమాల్లో దీనిపై హర్షం వ్యక్తమైనట్లు పేర్కొంది. కొందరు రాజకీయ నాయకులు, హక్కుల సంఘాలు మాత్రం దీనిపై విచారణ జరిపించాలని కోరుతున్నట్లు కథనం రాసింది. యూకేకు చెందిన ‘ది టైమ్స్‌’ కూడా ఈ ఘటనను ప్రముఖంగా ఇచ్చింది.

అల్‌జజీరా: ఖతారీ మీడియా అల్‌జజీరా ఎన్‌కౌంటర్‌ ఘటనపై వార్త ఇస్తూ భారత్‌లో పోలీసులు చేస్తున్న పలు ‘ఎన్‌కౌంటర్ల’పై విమర్శలొస్తున్నట్లు పేర్కొంది. ఎన్‌కౌంటర్‌పైనా, అనంతర పరిణామాలపైనా, ప్రజల సంబరాలు చేసుకొన్న విషయమై ‘గల్ఫ్‌ న్యూస్‌’ అనేక చిత్రాలతో వార్తలందించింది.

ఇదీ చూడండి:మృత్యువుతో పోరాడుతూ ఉన్నావ్​ ఘటన బాధితురాలు మృతి

Last Updated : Dec 7, 2019, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details