ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అమెరికాలో కొత్తగా 25 వేలపైగా మందికి కరోనా సోకింది. అగ్రరాజ్యంలో వైరస్ బాధితుల సంఖ్య 10 లక్షల 35 వేలు దాటింది. 59 వేల మందికిపైగా చనిపోయారు. 24 గంటల వ్యవధిలోనే 2,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షా 42 వేల మందికిపైగా కోలుకున్నారు.
- స్పెయిన్‌లో కొత్త కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 2 లక్షల 32 వేలు దాటింది. మృతుల సంఖ్య 23 వేల 822కు చేరింది.
- ఇటలీలో కేసులు 2 లక్షలను అధిగమించాయి. 27 వేల 359 మంది మృతిచెందారు. ఫ్రాన్స్‌లో కొవిడ్ బాధితుల సంఖ్య లక్షా 65 వేల 842కు చేరగా, 23 వేల 660 మంది మరణించారు.
- జర్మనీలో మొత్తం కేసులు లక్షా 59 వేల 431 కాగా, 6వేల 215 మంది మృతి చెందారు.
- బ్రిటన్‌లో కరోనా బాధితులు లక్షా 31 వేల 145కి చేరగా, 21వేల 648 మంది మృత్యువాతపడ్డారు.
మిగతా దేశాల్లో...
టర్కీలో లక్షా 14వేల 653 కేసులు నమోదు కాగా, 2 వేల 992 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కొవిడ్‌కేసులు 93 వేలు దాటాయి. మృతుల సంఖ్య 867కు పెరిగింది. ఇరాన్‌లో 92 వేల 584 మందికి వైరస్‌సోకగా......72 వేల మందికిపైగా కోలుకున్నారు. 5 వేల 877 మంది మృతిచెందారు.