తెలంగాణ

telangana

By

Published : Oct 4, 2020, 8:03 AM IST

ETV Bharat / international

'కరోనా' పంజా: మూడున్నర కోట్లు దాటిన కేసులు

కరోనా వైరస్​ దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. 3 లక్షల మందికిపైగా రోజూ కొవిడ్​​ బారిన పడుతున్నారు. అమెరికా, భారత్​, బ్రెజిల్​, రష్యా వంటి దేశాల్లోనూ ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే మొత్తం గ్లోబల్​ కేసుల సంఖ్య 3.5 కోట్లు దాటగా.. 10.37 లక్షల మందికిపైగా మరణించారు.

Global COVID-19
కరోనా విలయం

ప్రపంచంపై కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. వేగంగా వ్యాప్తి చెందుతూ రోజుకు 3లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల మందికి వైరస్​ సోకింది. 10.37 లక్షల మందికిపైగా మరణించారు. ఇదే సమయంలో 2.61 కోట్ల మంది కోలుకోవటం ఊరట కలిగిస్తోంది. అమెరికా, భారత్​, బ్రెజిల్​, రష్యాలతో పాటు పలు దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది.

మొత్తం కేసులు: 35,127,596

మరణాలు: 1,037,941

కోలుకున్నవారు: 26,121,777

యాక్టివ్​ కేసులు: 7,967,878

  • అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా సోకినవారి సంఖ్య 76 లక్షలు దాటింది. మొత్తం 2.14 లక్షల మందికిపైగా వైరస్​ కాటుకు బలయ్యారు. 48.18 లక్షల మంది కొవిడ్​ నుంచి కోలుకోగా.. 25.68 లక్షల యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • బ్రెజిల్​లో కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు వైరస్​ బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. 1.46 లక్షల మంది వైరస్​కు బలయ్యారు.
  • రష్యాలో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 12 లక్షలు దాటింది. ఇందులో 9.75 లక్షల మంది కోలుకోగా.. 2 లక్షల మంది వరకు చికిత్స పొందుతున్నారు. కేసులు పెరుగుతున్నా మరణాలను కట్టడి చేయగలిగింది రష్యా. 21వేల మంది మరణించారు.
  • కొలంబియాలో కొవిడ్​ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 8.5 లక్షలకు చేరువైంది. 26 వేలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ ఉద్థృతి అధికంగా ఉన్న మెక్సికో, స్పెయిన్​ను దాటుకుని ఐదో స్థానానికి చేరుకుందీ దేశం.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు..

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 7,600,846 214,277
బ్రెజిల్​ 4,906,833 146,011
రష్యా 1,204,502 21,251
కొలంబియా 848,147 26,556
పెరు 824,985 32,665
స్పెయిన్​ 810,807 32,086
అర్జెంటీనా 790,818 20,795
మెక్సికో 757,953 78,880

ABOUT THE AUTHOR

...view details