ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజురోజుకూ వేలాది మంది మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం నాటికి మరో 68 వేల కేసులు బయటపడ్డాయి. మరో 1,695 మంది మరణించారు. కేసుల సంఖ్యతో పాటే కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరగడం కాస్త సానుకూల పరిణామంగా కనిపిస్తోంది.
మొత్తం కేసుల సంఖ్య---2,52,25,566
యాక్టివ్ కేసులు---68,03,002
మరణాల సంఖ్య---8,47,676
రికవరీల సంఖ్య---1,75,74,888
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 61 లక్షల 41 వేలకు పెరిగింది. మరణాల సంఖ్య 1.86లక్షలకు చేరింది.
- రష్యాలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. కొత్తగా 4,980 కేసులు గుర్తించారు అధికారులు. 68 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 17,093కి పెరిగింది.
- మెక్సికోలో వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. కొత్తగా 673 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 63,819కి చేరింది. 5,974 కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 591,712కి చేరుకుంది.
- కొలంబియాలో కేసుల సంఖ్య ఆరు లక్షలకు చేరువగా ఉంది.