ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 41 లక్షల కేసులు నమోదుకాగా 2 లక్షల 80వేల మంది మరణించారు. అమెరికాలో కొత్తగా 25వేలమందికిపైగా వైరస్ సోకగా... కేసుల సంఖ్య 13 లక్షల 47 వేలు దాటింది. దేశంలో కొవిడ్ కాటుకు 80వేల మంది బలయ్యారు.
రష్యాలోనూ మళ్లీ ఒక్కరోజు కేసుల సంఖ్య 10 వేలు దాటింది. అక్కడ మొత్తం బాధితులు 2 లక్షలకు చేరువయ్యారు. 1,827 మంది మరణించారు.
బ్రిటన్‌లో మరో 3 వేల 9 వందల మంది వ్యాధి బారినపడగా... కేసులు 2 లక్షల 15వేలకు చేరాయి. ఇప్పటివరకు 31 వేలకుపైగా మృతిచెందారు. శనివారం మరో 346 మంది చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో కనిష్ఠంగా శనివారం 80 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. మరో 579 కేసులే నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 26 వేల 310కి చేరగా.. ఇప్పటివరకు లక్షా 76 వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు.
- 24 గంటల వ్యవధిలో ఇటలీలో 194, స్పెయిన్‌లో 179 మంది బలయ్యారు.
- బ్రెజిల్లో మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 664 మంది చనిపోయారు. మరో 10 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
మెక్సికోలో ఒక్కరోజే 19 వందల మంది వ్యాధి బారినపడగా కేసుల సంఖ్య 31వేలకుపైగా ఉంది. టర్కీలో 1500 మందికి కొవిడ్ పాజిటివ్ రాగా కేసుల సంఖ్య లక్షా 37వేలకు చేరింది. మృతుల సంఖ్య 3 వేలకుపైగా ఉంది. సౌదీలో 17వందల మందికి వైరస్ వ్యాపించగా...కేసుల సంఖ్య 37వేలు దాటింది.
పాకిస్థాన్‌లో కొత్తగా 2300 కేసులు, 37 మరణాలు సంభవించాయి. సింగపూర్‌లో మరో 753 మందికి వైరస్ సోకింది.