ప్రపంచ వ్యాప్తంగా.... కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అమెరికాలో రోజుకు 30 వేల కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అగ్రరాజ్యంలో మొత్తం కేసులు 10లక్షల 95 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లోనే మరో 2 వేల మందికి పైగా చనిపోగా మృతుల సంఖ్య 64 వేలకు చేరువైంది. మహమ్మారి బారిన పడి కోలుకున్నవారి సంఖ్య లక్షన్నర దాటింది.
అగ్రరాజ్యం పక్కనే ఉన్న మెక్సికోలో కరోనా బాధితుల సంఖ్య 19 వేలు దాటింది. మెుత్తం మరణాల సంఖ్య 1,859గా నమోదైంది.
- స్పెయిన్‌లో మొత్తం కేసులు 2లక్షల 40 వేలకు చేరువయ్యాయి. 24వేల 543 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 268 మంది చనిపోయారు.
- ఇటలీలో మెుత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. తాజాగా 285 మంది మృతి చెందారు.
- ఫ్రాన్స్‌లో కరోనా బాధితుల సంఖ్య లక్ష 67 వేలు దాటింది. 289 మంది నిన్న మృత్యువాత పడ్డారు.
- బ్రిటన్‌లో మెుత్తం కేసుల సంఖ్య లక్ష 71 వేల 253 గా నమోదైంది. నిన్న ఒక్క రోజే 674 మంది మరణించగా ఆ దేశంలో కొవిడ్‌కి బలైన వారి సంఖ్య 17 వేలకు సమీపించింది.
- బెల్జియంలో మొత్తం కేసులు 48 వేల 519కి చేరాయి. 7వేల 594 మంది మరణించారు.
- నెదర్లాండ్స్‌లో మొత్తం కేసులు.. 39వేల 316 కు చేరగా ఇప్పటిదాకా 4వేల 795 మంది మరణించారు.
మిగతా దేశాల్లో...