తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా: 6.5కోట్లకు చేరువైన కేసులు - అమెరికాలో కరోనా

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 మహావిలయం కొనసాగుతూనే ఉంది. రోజుకు సుమారు 5 లక్షల మందికి సోకుతూ రాకెట్​ వేగంతో దూసుకెళుతోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6.5 కోట్లకు చేరువైంది. ఒక్కరోజు కేసుల్లో అమెరికా, భారత్​ తర్వాత టర్కీలో అత్యధికంగా 31వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

Global covid-19 cases
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు

By

Published : Dec 1, 2020, 11:02 AM IST

ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. రోజు రోజుకు కొత్త కేసుల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయానికి దాదాపు 5 లక్షల మందికి కొత్తగా వైరస్​ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 6.5 కోట్లకు చేరువైంది. మరణాలు కోటీ యాభై లక్షలకు చేరువయ్యాయి.

మొత్తం కేసులు: 63,589,725

మరణాలు: 1,473,926

కోలుకున్నవారు: 43,984,723

క్రియాశీల కేసులు: 18,131,076

  • అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా 1.61 లక్షల మందికి వైరస్​ సోకింది. 12 వందల మందికిపైగా మరణించారు. మొత్తం కేసుల సంఖ్య కోటీ 40 లక్షలకు చేరువైంది. అయితే.. ఇప్పటి వరకు 82 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. 54 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.
  • టర్కీలో వైరస్​ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. కొత్తగా 31వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6.38 లక్షలు దాటింది. 13 వేల మంది మరణించారు. కొత్త కేసుల్లో అమెరికా, భారత్​ తర్వాతి స్థానంలో నిలిచింది.
  • జర్మనీలో వైరస్​ పంజా విసురుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 14వేలకుపైగా మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 10.69 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 17 వేలకు చేరువైంది.
  • ఇరాన్​లోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 13,321 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 9.62 లక్షలు దాటింది.
  • పోలాండ్​లో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 5,733 కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 9.90 లక్షలు దాటింది. 17,150 మంది మరణించారు.

వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 13,919,870 274,332
బ్రెజిల్ 6,336,278 173,165
రష్యా 2,295,654 39,895
ఫ్రాన్స్ 2,222,488 52,731
స్పెయిన్​ 1,664,945 45,069
యూకే 1,629,657 58,448
ఇటలీ 1,601,554 55,576
అర్జెంటీనా 1,424,533 38,730

ABOUT THE AUTHOR

...view details