కరోనా వైరస్ ధాటికి ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో మృతిచెందుతున్నారు. తాజాగా ఈ వైరస్ కారణంగా సంభవించిన మరణాలు 40 వేలు దాటాయి. ఐరోపాలోనే రెండింట మూడొంతులకు(29,305) పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచంపై కరోనా పంజా.. 40 వేలు దాటిన మృతులు - కరోనా లేటెస్ట్ న్యూస్
ప్రపంచంపై కొవిడ్-19 విశ్వరూపం చూపుతోంది. ఈ వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40 వేలు దాటింది. ఐరోపాలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. ఇటలీలో మరో 837 మంది మరణించగా.. మొత్తం వైరస్ మరణాలు 12 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి
కరోనా
ఐరోపా దేశాల్లో అత్యధికంగా ఇటలీలో 12,428 మంది మృతి చెందడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇవాళ ఒక్కరోజే 837 మంది మరణించారు. కొత్తగా 4,053 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,05,792కి చేరింది.
స్పెయిన్లో 8,269 మంది మరణించగా.. వైరస్ ఉద్భవించిన చైనాలో 3,305 మంది తనువు చాలించారు. ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో లక్షా 72 వేలకు పైగా కరోనా బాధితులను గుర్తించారు. ఆసియాలో 1,08,421 కేసులు నమోదయ్యాయి.