జర్మనీలోని హనావ్‌లో హుక్కా కేంద్రాలే లక్ష్యంగా వరుస కాల్పులకు పాల్పడిన ఘటనలో అనుమానితుల్లో ఒకడు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అనుమానితుడు తన నివాసంలో శవమై కనిపించినట్లు తెలిపారు. మరో మృతదేహాన్ని కూడా గుర్తించినట్లు స్పష్టం చేశారు.
జర్మనీ కాల్పులు: అనుమానితుడి శవంతో కొత్త మలుపు!
జర్మనీ కాల్పుల ఘటనకు సంబంధించిన అనుమానితుడు తన నివాసంలో శవమై కనిపించాడు. హుక్కా కేంద్రాలే లక్ష్యంగా జరిగిన కాల్పుల్లో 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
జర్మనీ కాల్పులు: అనుమానితుడి శవంతో కొత్త మలుపు!
హనావ్ నగరంలో.. హుక్కా కేంద్రాలే లక్ష్యంగా బుధవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 8 మంది మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. తొలుత.. నగరం మధ్యనున్న హుక్కా సెంటర్ వద్ద కాల్పులు జరిపిన దుండగులు.. అక్కడి నుంచి కారులో పరారై అరేనాబార్ వద్ద మరోసారి కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. మొదటి ఘటనలో ముగ్గురు మృతిచెందగా, రెండో ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
Last Updated : Mar 1, 2020, 10:40 PM IST