తెలంగాణ

telangana

ETV Bharat / international

నవంబర్​1న భారత్​లో జర్మనీ ఛాన్సలర్ పర్యటన - ప్రధాని మోదీతో ఏంజెలా మెర్కెల్ భేటీ

నవంబర్ 1న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత్​లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​కోవింద్​, ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో ఇరుదేశాల సంబంధాల బలోపేతంపై చర్చలు జరుపనున్నారు.

నవంబర్​1న భారత్​ పర్యటనకు జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్​

By

Published : Oct 26, 2019, 5:21 AM IST

Updated : Oct 26, 2019, 6:49 AM IST

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నవంబర్​ 1న భారత్​ పర్యటనకు రానున్నారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్రమోదీతో చర్చలు జరుపనున్నారు.

పర్యటన సందర్భంగా మెర్కెల్, మోదీ కలిసి ఐదో ద్వైవార్షిక ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్​ (ఐజీసీ)కి సహ అధ్యక్షులుగా వ్యవహరిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

"భారత్​, జర్మనీ వ్యూహాత్మక భాగస్వాములు. పరస్పర అవగాహన, నమ్మకంతో ముందుకు సాగుతున్నాయి."- భారత విదేశాంగ మంత్రిత్వశాఖ

మెర్కెల్​తో పాటు పలువురు జర్మనీ​ మంత్రులు, రాష్ట్ర కార్యదర్శులు సహా వ్యాపార ప్రతినిధులు భారత్​లో పర్యటిస్తారు. ఐజీసీ ఫార్మాట్​ కింద ఇరుదేశాలకు చెందిన ఆయా శాఖల మంత్రులు సంబంధిత అంశాలపై చర్చలు జరుపుతారు. పురోగతిని ఐజీసీకి నివేదిస్తారు.

ఐజీసీలో రవాణా, నైపుణ్య అభివృద్ధి, ఇంధన రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై ఇరుదేశాలు చర్చించనున్నాయి. గ్రీన్ అర్బన్ మొబిలిటీ, కృత్రిమ మేధ వంటి నూతన అంశాలనూ ప్రస్తావించే అవకాశం ఉంది.

కీలక వాణిజ్య భాగస్వామి

భారత్​కు ఐరోపాలో జర్మనీయే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2018లో జర్మనీ ప్రపంచ వాణిజ్యంలో భారత్​కు 25వ స్థానం దక్కింది.

ఇదీ చూడండి: పీఓకేలో ఉగ్రవాదుల ప్రభుత్వమే నడుస్తోంది: రావత్​

Last Updated : Oct 26, 2019, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details