తెలంగాణ

telangana

ETV Bharat / international

'గేట్స్ కేంబ్రిడ్జ్ క్లాస్ ఆఫ్ 2021'కు భారతీయులు - భారతీయ స్కాలర్లు ఎంపిక

'గేట్స్ కేంబ్రిడ్జ్ క్లాస్ ఆఫ్ 2021' పేరిట నిర్వహించిన స్కాలర్​షిప్​ పోటీలో భారతీయులు సత్తా చాటారు. ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అంతర్జాతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్​ స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్​కి తొమ్మిది మంది భారతీయులు ఎంపికయ్యారు.

gates cambridge scholarship 2021
'గేట్స్ కేంబ్రిడ్జ్ క్లాస్ ఆఫ్ 2021'కి 9 మంది భారతీయుల ఎంపిక

By

Published : Apr 15, 2021, 7:16 AM IST

అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక 'గేట్స్ కేంబ్రిడ్జ్ క్లాస్ ఆఫ్ 2021'(కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్​ స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్​)కి 9 మంది భారతీయ స్కాలర్లు ఎంపికయ్యారు. వీరితో సహా ప్రపంచవ్యాప్తంగా 74 మంది అభ్యర్థులు దీనికి ఎంపికయ్యారు. 2000 సంవత్సరంలో 'బిల్​, మిలిందా గేట్స్ ఫౌండేషన్​' దీనికి 21 కోట్ల అమెరికన్​ డాలర్లను విరాళంగా అందజేసింది. బ్రిటన్​లో ఓ విశ్వవిద్యాలయానికి ఒకేసారి అత్యధికంగా ఇచ్చిన విరాళం ఇదే. ఈ ఏడాది ఎంపికైన స్కాలర్లు కూడా ఎప్పటిలా అకడమిక్ విద్యలోను, నాయకత్వ సామర్థ్యాల్లోనూ అసాధారణ ప్రజ్ఞాపాటవాలున్నవారేనని గేట్స్ కేంబ్రిడ్జ్ ట్రస్ట్ అధిపతి ప్రొఫెసర్​ బారీ ఎవరిట్ తెలిపారు.

ఎంపికైన భారతీయులు..

అనన్య(లండన్​ యూనివర్సిటీలో జెండర్​ స్టడీస్​ మాస్టర్స్ పూర్తిచేసి.. సోషల్ ఆంథ్రోపాలజీ ఎం.ఫిల్​ చేస్తున్న విద్యార్థి), రిషభ్​ బజోరియా(1960 సింధు జలాల ఒప్పందంపై ప్రాజెక్టు చేస్తున్న లీగల్ స్టడీస్ పీహెచ్​డీ విద్యార్థి), అమెరికాలో ఉంటున్న తథాగత్​ భాటియా(ఎం.ఫిల్-హిస్టరీ, ఫిలాసఫీ ఆఫ్​ సైన్స్ అండ్​ మెడిసిన్​), సూర్య డేకా, నిఖితా ఝూ(విద్యావేత్తలు), అన్వేష లహరి(ఎపిడమాలజిస్ట్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ), మిషికా మెహరోత్రా(సైకాలజీ గ్రాడ్యుయేట్), అర్నాబ్ సర్కార్(ఆస్ట్రానమీ విద్యార్థి), సమర్పితా సేన్​(జెనెటిక్స్ స్కాలర్). వీరితో పాటు భారత సంతతికి చెందిన - ఇండియన్ అమెరికన్, ఫిజికల్ సైన్సెస్ విద్యార్థి వెంకట చలువాడి, రేడియాలజిస్ట్ తన్వీ రావు, హెల్త్ కేర్ నిపుణుడు వీరజ్​ షా, ఇంగ్లీషు సాహిత్యం విద్యార్థి మీనా వెంకటరమణన్ కూడా ఉన్నారు. 20వ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఈ స్కాలర్​షిప్​ ప్రోగ్రామ్​కి 2001 నుంచి 111 దేశాలు, 600పైగా విశ్వవిద్యాలయాలకు చెందిన 2 వేల మందికి పైగా ఎంపికైనట్లు గేట్స్ కేంబ్రిడ్జ్ ట్రస్ట్ తెలిపింది.

ఇవీ చదవండి:'కొవిడ్​ అనంతరం కొత్త ఉపాధి అవకాశాలు'

'మయన్మార్​ నిరసనల్లో 51 మంది పిల్లలు మృతి'

ABOUT THE AUTHOR

...view details