కొవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి తెలిపే ప్రక్రియనును వేగవంతం చేయడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థను(డబ్ల్యూహెచ్ఓ) బలోపేతం చేయాలని ప్రధాని మోదీ సహా జీ20 దేశాల(G20 Summit 2021) నేతలు అంగీకరించారు. ఈ మేరకు జీ20 సదస్సు(G20 Summit 2021) భారత ప్రతినిధి పీయూష్ గోయల్ ఆదివారం తెలిపారు.
జీ20 సదస్సులో పాల్గొన్న సభ్య దేశాల నేతలు 'రోమ్ తీర్మానం' ఆమోదించారని గోయల్ తెలిపారు. కొవిడ్ పోరాటంలో ప్రజలందరికీ రోగ నిరోధకతను పెంచడమే కీలకం అనే సందేశమిచ్చారని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన టీకాలను పరస్పరం అంగీకరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
"కొవిడ్ టీకాలకు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగం ఆమోదం తెలిపే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహాయపడాలని జీ20 దేశాల నేతలు అంగీకరించారు. డబ్ల్యూహెచ్ఓ బలోపేతమైతే.. టీకాల గుర్తింపు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని పేర్కొన్నారు."