శనివారం జరిగిన నిరసనలు ఆర్క్ డీ ట్రయాంప్ వద్ద ప్రారంభమై లక్సెంబర్గ్ గార్డెన్స్ వద్ద ముగిశాయి. జాతీయ అసెంబ్లీ సమీపంలో ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు.
'పసుపు దళం' ఉద్యమ హోరు - యెల్లో వెస్ట్
ఫ్రాన్స్‌లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన 'యెల్లో వెస్ట్' నిరసనలు 17వ వారానికి చేరుకున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న వందల మంది ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.
ఫ్రాన్స్ వీధుల్లో నిరసనల హోరు
ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా గత ఏడాది నవంబర్ 17న నిరసనకారులు ఫ్రాన్స్ వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. ఆ తరువాత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజల డిమాండ్ల సాధనవైపు ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Last Updated : Mar 10, 2019, 9:16 AM IST