తెలంగాణ

telangana

ETV Bharat / international

'పెగసస్​తో ఫోన్ల హ్యాకింగ్​ వాస్తవమే' - పెగసస్​ స్పైవేర్​

పెగసస్​ వ్యవహారంపై ఫ్రాన్స్​ సైబర్​ భద్రతా సంస్థ ఏఎన్​ఎస్​ఎస్​ఐ కీలక ప్రకటన చేసింది. తమ దేశానికి చెందిన ఓ ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లలో ఈ​ స్పైవేర్​ కనిపించిందని స్పష్టం చేసింది.

pegasus in france
ఫ్రాన్స్​లో పెగసస్​

By

Published : Jul 30, 2021, 12:48 PM IST

భారత్​లో పెగసస్​ హ్యాకింగ్​ వ్యవహారంపై తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ.. ఫ్రాన్స్​కు చెందిన సైబర్ భద్రతా విభాగం కీలక ప్రకటన చేసింది. తమ దేశంలోని ఓ ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లలో ఈ స్పైవేర్​ కనపించిందని ధ్రువీకరించింది. ఈ మేరకు ఏఎన్​ఎస్​ఎస్​ఐ సంస్థ చేసిన అధ్యయనం వివరాలను మీడియా పార్ట్ అనే ఫ్రెంచ్​ ఆన్​లైన్​ జర్నల్​ ప్రచురించింది. తమ ఇద్దరు జర్నలిస్టులపై ఈ స్పైవేర్​తో నిఘా ఉంచారని చెప్పింది.

పెగసస్​ వ్యవహారంపై అంతకుముందు అమ్నెస్టీ ఇంటర్నేషనల్​ సంస్థకు చెందిన సెక్యూరిటీ ల్యాబ్​ ఇచ్చిన నివేదికకు దగ్గరగా ఏఎన్​ఎస్​ఎస్​ఐ నిర్వహించిన అధ్యయనం ఉందని మీడియా పార్ట్​ తెలిపింది. ఇజ్రాయెల్​కు చెందిన ఈ స్పైవేర్​... స్మార్ట్​ఫోన్లలో సందేశాలను, కాల్​ రికార్డులను తెలుసుకునేందుకు వినియోగించవచ్చని తమ దర్యాప్తులో తేలిందని ఏఎన్​ఎస్​ఎస్​ఐ వివరించింది.

భారత్​లో దుమారం..

భారత్​లో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, 40 మందికిపైగా జర్నలిస్టులు సహా 300 మంది మొబైల్​ ఫోన్​ నంబర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు 'ద వైర్‌' వార్తాసంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్​కు చెందిన పెగసస్ అనే​ స్పైవేర్​ను ఇందుకు వినియోగించారని చెప్పింది. బాధితుల జాబితాలో వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు సహా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి కూడా ఉన్నారని పేర్కొంది. దీంతో ఈ పెగసస్​ వ్యవహారం.. భారత్​లో తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతుండగా.. పార్లమెంటు సమావేశాల్లో గందరగోళం నెలకొంటూ వస్తోంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details