పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీలో ఫ్రాన్స్ వైమానిక దళాలు జరిపిన దాడుల్లో 50 మందికిపైగా జిహాదీలు హతమయ్యారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకోగా.. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.
ఫ్రాన్స్ వైమానిక దాడుల్లో 50మంది ఉగ్రవాదులు హతం - French airstrikes in mali
మాలీలో ఫ్రాన్స్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 50 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. తరుచూ ఉగ్రదాడులకు గురవుతున్న నేపథ్యంలో ముష్కరులను అణిచివేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది ఫ్రాన్స్.
ఫ్రాన్స్ వైమానిక దాడుల్లో 50మంది ఉగ్రవాదులు హతం
ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులతో సతమతమవుతున్న ఫ్రాన్స్.. ముష్కరులను తుదముట్టించేందుకు 2014 ఆగస్టులో పశ్చిమ ఆఫ్రికాలో 'బార్ఖేన్ ఆపరేషన్'ను చేపట్టింది. ఉత్తర మాలి సరిహద్దుల్లో డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కదులుతున్నట్లు అనుమానం వచ్చి.. మొదట వైమానిక దాడులు జరిపింది ఫ్రాన్స్. అనంతరం సైన్యాన్ని రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:మలబార్ విన్యాసాలపై ఉలిక్కిపడ్డ చైనా!