కశ్మీర్ అంశం భారత్-పాకిస్థాన్‌ల ద్వైపాక్షిక అంశమేనని పేర్కొంది ఫ్రాన్స్. చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరింది.
ఆపరేషన్ కశ్మీర్‌పై సాయం కోసం పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషీ... ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియాన్స్తో మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు డ్రియాన్స్. కశ్మీర్‌పై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. కశ్మీర్ అంశం ఇరుదేశాలకు సంబంధించినదిగానే చూస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
కశ్మీర్ అంశం పూర్తిగా అంతర్గత వ్యవహారమన్నది భారత్ వాదన. ఇందుకు భిన్నంగా ఫ్రాన్స్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.