ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకుంటానని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ అనడం పట్ల హర్షం వ్యక్తం చేసింది ఫ్రాన్స్. బ్రిటన్ వాసులకు ఐరోపా సమాఖ్యలోని దేశాల పట్ల ఉన్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తుందని పేర్కొంది.
"ఫ్రెంచ్ పౌరసత్వం పొందడానిక బ్రిటన్ ప్రధాని బోరిస్ తండ్రి స్టాన్లీ జాన్సన్ అర్హుడైతే తప్పకుండా పౌరసత్వం ఇస్తాం. ఆయనకు పౌరసత్వాన్ని ఇచ్చే విషయాన్ని త్వరలో పరిశీలిస్తాం. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ విడిపోయినప్పటికీ కూటమితో వారికి ఎలాంటి అనుబంధం ఉందో ఈ సంఘటన తెలియజేస్తోంది."