తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్రాన్స్​లో రెండో లాక్​డౌన్​- ప్రకటించిన మేక్రాన్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహా విలయం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 4,49,10,565కు చేరింది. మరణాల సంఖ్య 11,81,130కి పెరిగింది. ఐరోపాలో పలు దేశాలు కరోనా కట్టడికి మళ్లీ లాక్​డౌన్​ విధించేందుకు సిద్ధమవుతున్నాయి.

France
కరోనా 2.0 భయం- ఐరోపాలో ఆంక్షల వలయం

By

Published : Oct 29, 2020, 7:35 PM IST

Updated : Oct 30, 2020, 6:30 AM IST

నాలుగు నెలల విధ్వంసం తర్వాత పరిస్థితులు మెల్లిమెల్లిగా చక్కబడ్డాయని భావించిన ఐరోపాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. చాలా దేశాల్లో మరోసారి లాక్​డౌన్ పరిస్థితులు తీసుకొచ్చింది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లో ఐరోపా వ్యాప్తంగా కేసులు వేగంగా పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తమైన ప్రభుత్వాలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఫ్రాన్స్​ షట్​డౌన్​..

ఫ్రాన్స్​లో వ్యాపారులు మరో నెల రోజుల పాటు కార్యకలాపాలను షట్​డౌన్​ చేసేందుకు నిర్ణయించారు. అయితే పాఠశాలలు తెరిచే ఉంటాయి. కర్మాగారాలు, పార్క్​లు, రైతు మార్కెట్​లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్త ఆంక్షలను ప్రభుత్వం అతి త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

ఆయా దేశాల్లో...

  1. స్పెయిన్​లో అండాలూసియా, క్యాజిల్​-లా-మంచా, క్యాజిల్ అండ్​ లియోన్, ముర్షియా ప్రాంతాలకు రాకపోకలను ఆయా స్థానిక ప్రభుత్వాలు నిషేధించాయి.
  2. ఇప్పటివరకు వైరస్​ జాడ కనిపించని మార్షల్​ దీవుల్లో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి.
  3. బ్రిటన్​లో కరోనా పరిస్థితులపై తాజాగా చేసిన అధ్యయనం ఆందోళనకర విషయాలు వెల్లడించింది. రానున్న రోజుల్లో లండన్​లో రోజుకు 96 వేలకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
  4. జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​.. శీతాకాలంలో వైరస్​ మరింత విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే రోజువారీ కేసులు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించాలని యోచిస్తున్నారు.
  5. కరోనా పుట్టినిల్లు చైనాలో కొత్తగా 47 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇందులో 23 కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేవు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు

దేశం కేసులు మరణాలు
అమెరికా 9,121,800 233,137
బ్రెజిల్ 5,469,755 158,468
రష్యా 1,581,693 27,301
ఫ్రాన్స్ 1,235,132 35,785
స్పెయిన్​ 1,194,681 35,466
Last Updated : Oct 30, 2020, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details