ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ.. ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 1000 కంటే ఎక్కువ మంది సమావేశం కావడంపై నిషేధం విధించింది. వైరస్ను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకొంది.
ఇల్లు కదలని అధ్యక్షుడు..

మరోవైపు వైరస్ ప్రభావిత దేశమైన పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి కారణంగానే ప్రజా కార్యకలాపాలను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇటీవల ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల బృందంతో మార్సెలో సమావేశమయ్యారు. వారిలో ఓ విద్యార్థికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే అధ్యక్షుడికి ఎటువంటి వైరస్ లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. పోర్చుగల్లో ఇప్పటివరకు 25 కరోనా కేసులు నమోదయ్యాయి.