సంగీతం మెదడును చైతన్యవంతం చేస్తుందా, చురుగ్గా పని చేయిస్తుందా? నచ్చిన పాట వింటే మెదడు ఉత్తేజితం అవుతుందా? అల్జీమర్స్‌తో బాధపడుతున్నవారు కూడా సంగీతానికి స్పందిస్తారా? అవుననే అంటున్నారు బ్రైటన్ విశ్వవిద్యాలయ (Brighton University music) పరిశోధకులు. స్ట్రోక్, అల్జీమర్స్, మెదడు గాయాల చికిత్సలో సంగీతం (Music effects on Brain) కీలక పాత్ర పోషిస్తోందని వీరు చెబుతున్నారు. ఇందుకోసం 'న్యూరోలాజిక్ మ్యూజిక్ థెరపీ' అనే చికిత్సా విధానాన్ని ముందుకు తెస్తున్నారు.
పరిశోధనలో కీలకాంశాలు
మానవుడి మెదడుపై సంగీతం చూపే ప్రభావం అపారం. మెదడులో మాటలు, కదలిక, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను నియంత్రించే భాగాలను సంగీతం ఉత్తేజితం చేస్తుంది. భౌతికంగా బ్రెయిన్ మ్యాటర్‌నూ పెంచుతుంది. మెదడు తనంతట తాను మరమ్మతు చేసుకునేందుకూ సంగీతం సాయపడుతుంది.